మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (10:53 IST)

నా టేబుల్‌పైనే అణ్వస్త్ర బటన్ ఉంది : కిమ్ జాంగ్ ఉన్

కొత్త సంవత్సరం... కొంగ్రొత్త ఆశలు, ఆశయాలు, ఆవిష్కరణలతో ముందుకెళ్లాలని ప్రపంచం భావిస్తోంది. కానీ, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మాత్రం తద్విరుద్ధంగా ఆలోచనలు చేస్తున్నారు.

కొత్త సంవత్సరం... కొంగ్రొత్త ఆశలు, ఆశయాలు, ఆవిష్కరణలతో ముందుకెళ్లాలని ప్రపంచం భావిస్తోంది. కానీ, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మాత్రం తద్విరుద్ధంగా ఆలోచనలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ప్రపంచాన్నే భయపెట్టే హెచ్చరికలు చేస్తున్నారు. తన టేబుల్‌పైనే అణ్వస్త్ర బటన్ ఉందంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
కొత్త యేడాదిలో కొత్త... కొత్త ఆశలతో ప్రపంచం ముందుకు వెళ్ళేందుకు ప్లాన్ చేసుకొంటోంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మాత్రం ప్రపంచ దేశాలను భయపెట్టే రీతిలో కొత్త సంవత్సర వేడుకల సందేశాన్ని ఇచ్చారు. తన టేబుల్‌పైనే న్యూక్లియర్ వెపన్ బటన్ ఉంటుందంటూ కిమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
గత యేడాదంతా వరుస అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలతో అగ్రరాజ్యం అమెరికాకు నిద్రలేకుండా చేసిన కిమ్ జాంగ్ ఉన్... ప్రపంచదేశాలకు కొరకరాని కొయ్యగా మారారు. ఈయనను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. పలు రకాల ఆంక్షలను ఇప్పటికే ఉత్తరకొరియాపై విధించారు. అంతేకాదు ప్రతి అవకాశాన్ని ఉత్తరకొరియాపై పైచేయి సాధించేందుకు అమెరికా ఉపయోగించుకొంటుంది.
 
ఈ నేపథ్యంలో ఆయన కొత్త సంవత్సరం రోజున ఓ సంచలన ప్రకటన చేశారు. "నా టేబుల్‌పై ఎప్పుడూ ఒక బటన్‌ ఉంటుంది. నొక్కితే అంతా బుగ్గిపాలే. అది.. న్యూక్లియర్‌ వెపన్‌" అంటూ ప్రకటించారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తమ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచదేశాలకు హెచ్చరిక చేశారు కిమ్. తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకొనేది లేదని కిమ్ ఈ సందేశంలో తేల్చి చెప్పారు. 
 
కొత్త సంవత్సరంలో ఎలాంటి ఉపద్రవాలు లేకుండా ఉండాలని కోరుకొంటున్న తరుణంలోనే హెచ్చరికలతోనే కొత్త సంవత్సరంలోకి కిమ్ కొత్త సంవత్సరంలోకి అడుగిడెలా చేశారు. ఇప్పటికే అణు పరీక్షలతో కిమ్ అమెరికాతో పాటు ఇతర దేశాలకు సవాల్‌ విసురుతున్నారు.