శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (12:30 IST)

అమెరికాతో సమానంగా అణ్వాయుధ సత్తా : ఉత్తర కొరియా

అమెరికా అణ్వాయుధ సాయుధసంపత్తికి సమానంగా తాము అణ్వాయుధాలను సమకూర్చుకున్నట్టు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. బుధవారం మరోసారి ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన విషయం తెల్సిందే.

అమెరికా అణ్వాయుధ సాయుధసంపత్తికి సమానంగా తాము అణ్వాయుధాలను సమకూర్చుకున్నట్టు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. బుధవారం మరోసారి ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన విషయం తెల్సిందే.
 
ఉత్తరకొరియా విజయవంతంగా జరిపిన మూడో ఖండాంతర క్షిపణి పరీక్ష ఇది. అమెరికా భూభాగాన్నంతటినీ లక్ష్యంగా చేసుకుని ఈ పరీక్షను నిర్వహించగా అది విజయవంతమైంది. ఈ క్షిపణి వాస్తవశ్రేణి 13,000 కి.మీ. అమెరికాలోని అన్ని ప్రధాన నగరాలను చేరగలదు.
 
ఈ ఖండాంతర క్షిపణి ప్రయోగం తర్వాత కిమ్ జాంగ్ ఉన్ స్పందిస్తూ, ఇక అమెరికాలోని ఏ ప్రాంతంపైనైనా తాము దాడి చేయగలమన్నారు. రెండు నెలల విరామం తర్వాత మరోసారి ఓ భారీ క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియా అమెరికాకు సరికొత్త సవాలును విసిరింది. ఎట్టకేలకు రాకెట్ శక్తిని నిర్మించగలిగే అణ్వాయుధ సామర్థ్యాన్ని సముపార్జించుకోవడంలో చారిత్రక విజయాన్ని సాధించామని ఆయన ఎంతో గర్వంగా ప్రకటించారు. 
 
ఈ ఖండాంతర క్షిపణి హాసాంగ్-15 అత్యంత అధునాతనమైనది. పైగా, అది అత్యంత ఎత్తులో ఎక్కువ దూరాన్ని ఈ క్షిపణి చేరుకుంది. ఈ క్షిపణి ఓ రకంగా అమెరికాను హడలెత్తించింది. ఈ క్షిపణి అత్యంత శక్తివంతమైందని స్వయంగా అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ ప్రకటించడం గమనార్హం. కాగా, హాసాంగ్-15 క్షిపణి ప్రయోగించిన స్థలం నుంచి 4,475 కి.మీ ఎత్తుకు వెళ్లి, 950 కిమీ దూరం ప్రయాణించి, జపాన్‌కు 250 కిమీ దూరంలో సముద్రంలో పడిపోయింది.