శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2017 (17:52 IST)

ఉత్తర కొరియాలో 'ఘోస్ట్‌ డిసీజ్‌'.. పారిపోతున్న సైనికులు

ఉత్తరకొరియాలో అంతుచిక్కని వ్యాధి ఒకటి విజృంభిస్తోంది. దీంతో ఆ దేశ సైనికులతో పాటు ప్రజలు ప్రాణబీతితో వణికిపోతున్నారు.

ఉత్తరకొరియాలో అంతుచిక్కని వ్యాధి ఒకటి విజృంభిస్తోంది. దీంతో ఆ దేశ సైనికులతో పాటు ప్రజలు ప్రాణబీతితో వణికిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా వరుస అణు పరీక్షలతో పాటు మిస్సైల్ టెస్టులను విజయవంతంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షల కారణంగా వెలువడిన రేడియేష‌న్ ప్రభావం కారణంగా ఈ పరిస్థితులు ఏర్పడినట్టు సమాచారం. 
 
ఈ పరీక్షల కారణంగా అణు ధార్మికత మోతాదుకు మించి వెల్లడైంది. దీంతో అనేక మంది అనారోగ్యానికి గుర‌వుతున్నట్టు సమాచారం. దీనికి భయపడి ఇప్పటికే ఆ దేశ సైనికులు పదుల సంఖ్యలో దక్షిణ కొరియాలోకి పారిపోయిన‌ట్లు స్థానిక మీడియా తెలిపింది. రేడియేషన్ కారణంగా ఆ సైనికులు చాలా బాధ‌ని అనుభ‌విస్తున్న‌ట్లు దక్షిణ కొరియా వైద్యులు పేర్కొన్నారు.
 
ఇదే అంశంపై సౌత్ కొరియాకు పారిపోయి వచ్చిన నార్త్ కొరియా సైనికుడు స్పందిస్తూ, అణు పరీక్షల వల్ల ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్యకు లెక్కేలేదని చెప్పాడు. రేడియేషన్‌ కారణంగా బాధపడే వారిని ‘ఘోస్ట్‌ డిసీజ్‌’ (దెయ్యం వ్యాధి)తో బాధపడుతున్నట్లు ఉత్తరకొరియాలో చెబుతున్నార‌ని వారు చెపుతున్నారు. 
 
అలాగే, అవయవలోపంతో జన్మించిన శిశువులను ఉత్త‌ర‌కొరియాలో చంపేస్తున్నారని తెలిపారు. కాగా, రేడియేషన్‌ కారణంగానే ఉత్తరకొరియాలో మరణాలు సంభవిస్తున్నాయన్నడానికి త‌మ‌కు ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన ఆధారాలు దొర‌క‌లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు.