మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2017 (14:55 IST)

జయమ్మ మృతి కేసు : చిన్నమ్మ శశికళకు సమన్లు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసు విచారణ వేగవంతమైంది. ఇందులోభాగంగా, జయలలిత ప్రియనెచ్చెలి శశికళతో పాటు.. జయలలితకు చికిత్స చేసిన అపోలో ఆస్పత్రికి కోర్టు సమన్లు జారీచేసింది. నిర్ణీత గడువులోగా

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసు విచారణ వేగవంతమైంది. ఇందులోభాగంగా, జయలలిత ప్రియనెచ్చెలి శశికళతో పాటు.. జయలలితకు చికిత్స చేసిన అపోలో ఆస్పత్రికి కోర్టు సమన్లు జారీచేసింది. నిర్ణీత గడువులోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో శశికళకు 15 రోజులు, అపోలో ఆసుపత్రికి 10 రోజుల గడువు విధించింది. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న శశికళ ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పణ అగ్రహారజైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. అలాగే, జయ మృతిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జస్టీస్ ఆరుముగ స్వామి నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కమిటీ విచారణ జరుపుతోంది. 
 
ఈ నేపథ్యంలో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు... జయలలితకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి కోర్టు సమన్లు జారీచేయడం గమనార్హం. మరోవైపు, ఆసుపత్రిలో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్న జయలలిత వీడియోను దినకరన్ వర్గీయులు విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే. దీంతో జయలలిత మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది.