శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (09:17 IST)

చెన్నై ఆర్.కె.నగర్ బైపోల్ ఓటింగ్... బరిలో 59 మంది అభ్యర్థులు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్థానిక ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 
 
ఈ ఉప ఎన్నికలో భాగంగా 256 పోలింగ్‌ కేంద్రాల్లో  ఓటింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి మరుదుగణేశ్‌, అన్నాడీఎంకే అభ్యర్థి ఇ.మధుసూదన్‌, అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్‌, బీజేపీ నేత కరు నాగరాజన్‌‌లతో పాటు మొత్తం 59 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
 
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.28 లక్షలు. ప్రతి పోలింగ్‌ కేంద్రం దగ్గర 50 మంది పోలీసులు, 15 మంది పారామిలటరీ బలగాలు, 9 మంది చొప్పున ఐఏఎస్‌, ఐపీఎస్‌, నలుగురు ఐఆర్‌ఎస్‌ అధికారులను పర్యవేక్షణగా నియమించారు. 
 
నియోజకవర్గ వ్యాప్తంగా 200 సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. 75 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు విధుల్లో ఉన్నాయి. 45 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ భద్రతా సిబ్బంది కాకుండా, స్థానిక పోలీసులు కూడా పోలింగ్ భద్రతలో నిమగ్నమయ్యారు.