శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (13:16 IST)

వారిని వదిలిపెట్టొద్దు... ప్రభుత్వం అప్పీల్ చేయాలి : సుబ్రమణ్య స్వామి

2జీ స్కామ్‌లో డీఎంకే నేతలు ఏ.రాజా, కనిమొళిలను నిర్దోషులుగా ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు విడుదల చేయడాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్రంగా ఆక్షేపించారు.

2జీ స్కామ్‌లో డీఎంకే నేతలు ఏ.రాజా, కనిమొళిలను నిర్దోషులుగా ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు విడుదల చేయడాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. ఈ కేసు తీర్పుపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేయాలని ఆయన కోరారు. సరైన ఆధారాలతో కేంద్ర ప్రభుత్వం తక్షణం హైకోర్టులో అప్పీల్ చేయాలని కోరారు. 
 
కాగా, గత యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కామ్‌పై తొలుత పిటీషన్ దాఖలు చేసింది సుబ్రమణ్య స్వామినే. ఈయన దాఖలు చేసిన పిల్‌ ఆధారంగా 2జీ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు 14 మందినీ నిర్దోషులుగా విడుదల చేసింది. దీనిపై  తీవ్రంగా స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి… ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటీషన్ దాఖలు చేయాలని సూచించారు. 
 
కాగా, ఈ తీర్పుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటుకు వచ్చి వివరణ ఇవ్వాలి. 2జీతో పాటు పలు కుంభకోణాల్లో యూపీఏ ప్రభుత్వం కూరుకుపోయిందనే తప్పుడు ప్రచారంతోనే మోడీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ కోర్టు తీర్పుతో అసలు విషయం ఏమిటో అందరికీ తెలిసింది. 2జీ అనేది విపక్షానికి చెందిన అబద్ధాలతో కూడిన స్కాం అనేది రుజువైందని అభిప్రాయపడ్డారు.