శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:12 IST)

ఆధార్ దేశ భద్రతకు పెనుముప్పు... ప్రధాని మోదీతో చెప్తా...

ఆధార్ కార్డు నెంబరు లింక్ చేయనిదే బ్యాంకు లావాదేవీలు సైతం బ్లాక్ చేస్తామంటూ ఓవైపు బ్యాంకులన్నీ హెచ్చరికలు చేస్తుంటే కొందరు నాయకులు మాత్రం ఆధార్ లింక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం అనేది జాతీయ భద్రతకు పెనుముప్పు అంటూ భాజపా రాజ్య

ఆధార్ కార్డు నెంబరు లింక్ చేయనిదే బ్యాంకు లావాదేవీలు సైతం బ్లాక్ చేస్తామంటూ ఓవైపు బ్యాంకులన్నీ హెచ్చరికలు చేస్తుంటే కొందరు నాయకులు మాత్రం ఆధార్ లింక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ అనుసంధానం అనేది జాతీయ భద్రతకు పెనుముప్పు అంటూ భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆధార్ కార్డు వినియోగంపై ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 
 
ఆధార్ కార్డ్ కంపల్సరీ అంటూ కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో స్వయంగా భాజపా నాయకుడే ఇలా ఆందోళన వ్యక్తం చేయండ చర్చనీయాంశంగా మారింది. సుబ్రహ్మణ్యస్వామి తన ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. 
 
కాగా ఇప్పటికే ఆధార్ కార్డు నెంబరును ఆదాయపన్ను శాఖతో సహా ఇతర ప్రభుత్వ పథకాలకు లింక్ చేయనిదే లావాదేవీలు బ్లాక్ చేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి. అలాగే బ్యాంకులు సైతం ఇలాంటి హెచ్చరికలనే పంపుతోంది.