సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (10:50 IST)

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇండియన్ స్టూడెంట్ మృతి

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఆంటారియో హైవేపై ప్రమాదం జరిగింది. ఐదుగురు భారతీయ విద్యార్థులు ఓ ప్యాసింజర్ వ్యానులో ప్రయాణిస్తుండగా ఆ వ్యాను ఢీకొట్టింది. విద్యార్థులు చనిపోయిన విషయాన్ని కెనడాలోని భారతీయ హై కమిషనర్ అజయ్ బిసారియా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
కెనడాలో ఓ హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుందని, టొరంటో సమీపంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు ఆటో ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన వెల్లడించారు. 
 
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల స్నేహితులతో తాము టచ్‌లో ఉన్నామని చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులను హర్ ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కరణ్ పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్‌లు ఉన్నారు.