గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (12:42 IST)

అమెరికాలో దారుణం.. మత్తుమందుకు తల్లిదండ్రులతో పాటు ఐదు నెలల చిన్నారి బలి..

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాల మత్తు మూడు నిండు ప్రాణాలను బలిగొన్న ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌కు దాదాపు 60మైళ్ల దూరంల

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాల మత్తు మూడు నిండు ప్రాణాలను బలిగొన్న ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌కు దాదాపు 60మైళ్ల దూరంలోని జాన్స్‌టౌన్‌ అనే పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన జాసన్‌ ఛాంబర్స్‌(27), చెల్సియా కార్డారో (19), ఐదునెలల చిన్నారి సమ్మర్‌ చాంబర్స్‌లు ఇంట్లో మృతి చెందినట్లు అధికారులు కనుగొన్నారు. 
 
హెరాయిన్‌ అతిగా తీసుకోవడం వల్ల వీరు మృతి చెందినట్లు భావిస్తున్నారు. దాదాపు వారం క్రితమే మృతి చెందగా గురువారం వీరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. వీరు నివసించే ఇంటి మొదటి అంతస్తులో భర్త చాంబర్స్‌ మృతి చెంది ఉండగా.. రెండో అంతస్తులోని బాత్‌‍రూమ్‌లో చెల్సియా మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు. వీరి పాప సమ్మర్‌ మృతదేహం బెడ్‌రూంలోని ఉయ్యాలలో పడి ఉండగా అధికారులు గుర్తించారు. 
 
తల్లిదండ్రులు ఇద్దరూ నిమిషాల వ్యవధిలో మృతి చెందగా అధికారులు చెప్తున్నారు. దీంతో చిన్నారి చెల్సియాకు ఆలనపాలన లేక ఆకలి దప్పికలతో కన్ను మూసింది. ఈ ఘటన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.