ఆప్ఘనిస్తాన్‌లో బస్సు ప్రమాదం.. 73 మంది సజీవదహనం
ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ - కాందహార్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాబూల్-కాందహార్ ప్రధాన రహదారిపై రెండు బస్సులు, ఓ ఆయిల్ ట్యాంకర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు పూర్తిగా దహనం కావడంతో 73 మంది సజీవదహనమయ్యారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వివరాలు తెలుసుకున్న రెస్క్యూటీం వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో గాయపడిన క్షత్రుగాత్రుల్ని సహాయక సిబ్బంది వెనువెంటనే గజనీ ప్రావిన్స్‌లోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 125 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. డ్రైవర్ వేగంగా నిర్లక్ష్యంతో వాహనాన్ని అతివేగంగా నడపడం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.