శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (15:55 IST)

మమ్మీ గొంతును రికార్డు చేసిన శాస్త్రవేత్తలు.. అదో పూజారి గొంతు..!

యూకేలోని లీడ్స్ సిటీ మ్యూజియంలో మూడువేల ఏళ్ల క్రితం అత్యంత పురాతన మమ్మీ గొంతును శాస్త్రవేత్తలు రికార్డ్ చేశారు. శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ వాయిస్ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ మమ్మీ ఈజిప్టు రాజు ఫైర్ రామ్సెస్-11 నాటి పూజారి నీలీయామున్‌కు సంబంధించిందని తెలిపారు.

ఈయన రాజుకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేవారని.. ఈ గొంతును రికార్డు చేసేముందు నీసియామూన్ మమ్మీ గొంతుకు సీటీ స్కాన్ తీశామని మమ్మీ గొంతును రీక్రియేట్ చేసిన శాస్త్రవేత్త డేవిడ్ హోవార్డ్ తెలిపారు. 
 
1099 నుంచి 1069 బీసీకి చెందిన వ్యక్తి నీసియామూన్ అని తెలిపారు. ఇతను 50 ఏళ్లలో ప్రాణాలు కోల్పోయాడని, అలెర్జీ కారణంగా చనిపోయాడని డేవిడ్ హోవార్డ్ చెప్పారు.

గమ్ డిసీస్‌తో బాధపడిన ఇతను.. తన ఆత్మ ఎప్పుడైనా దేవుడితో మాట్లాడుతుందని నమ్మేవాడని చెప్పుకొచ్చారు. మరణించిన వ్యక్తి యొక్క స్వరాన్ని పునః సృష్టి చేయడానికి సాంకేతికతను ఉపయోగించామని వెల్లడించారు.