మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (13:11 IST)

#మహేష్ రికార్డ్ బ్రేక్ చేసిన బన్నీ.. ఓవర్సీస్‌లో అల వైకుంఠపురంలో అదుర్స్

అల్లు అర్జున్ సంక్రాంతి రేసులో సక్సెస్ అయ్యాడు. అల వైకుంఠపురంలో సినిమాతో వచ్చిన ఈ స్టైలిష్ స్టార్ రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. అల వైకుంఠపురంలో సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైంది అల వైకుంఠపురంలో. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. తాజాగా ఓవర్సీస్‌లో అల వైకుంఠపురంలో డాలర్ల వర్షం కురిపిస్తోంది. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. 
 
భరత్ అనే నేను సినిమా ఓవర్సీస్‌లో 3.41 డాలర్ల కలెక్షన్లు రాబట్టగా, అల వైకుంఠ పురంలో 3.42 డాలర్ల కలెక్షన్లు రాబట్టింది. బాహుబలి సిరీస్, రంగస్థలం తర్వాత ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధిస్తున్న చిత్రంగా అల వైకుంఠపురంలో దూసుకెళ్తోంది. ఇక నైజాంలో కూడా ఈ సినిమా పేరిట రికార్డు వుంది. ఆదివారం రూ.2.25 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా.. ఇప్పటివరకు రూ.50 కోట్ల షేర్ మార్కెట్‌ను సెట్ చేసేందుకు రెడీ అవుతోంది.