శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 20 జనవరి 2020 (20:43 IST)

అల్లు అర్జున్ & సుకుమార్ చిత్రానికి టైటిల్ ఖరారు అవ్వలేదు

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్వకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయ్యింది. 
 
ఈ చిత్రానికి సంబంధించి ఒక టైటిల్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతొంది. కానీ చిత్ర యూనిట్ ఈ మూవీకి ఎటువంటి టైటిల్ ఖరారు చెయ్యలేదు. కొన్ని వెబ్ సైట్స్‌లో ఈ మూవీకి టైటిల్ పైన వస్తున్న వార్తల్లో నిజం లేదు. 
 
టైటిల్ ఖరారు అవ్వగానే చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. అల్లు అర్జున్‌కి ఇది 20వ సినిమా అవ్వడం విశేషం. సుకుమార్‌తో బన్నీ చేస్తున్న మూడో సినిమా ఇది.