శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2017 (09:40 IST)

చైనాలోని జింజియాంగ్‌లో భారీ భూకంపం.. వందలాది మంది మృతి..

చైనాలోని జింజియాంగ్‌ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. సమీపంలోని కజకిస్థాన్‌లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి. వరుస భూకంపాలతో చైనావ

చైనాలోని జింజియాంగ్‌ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. సమీపంలోని కజకిస్థాన్‌లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి. వరుస భూకంపాలతో చైనావాసులు కలవరపడుతున్నారు. 
 
ఈ భూకంపంలో దాదాపు వందమందికి పైగా మృతి చెందారు. మరో 175మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సైనికాధికారులు చెప్తున్నారు. కాగా, శిథిలాల కింద చిక్కుకున్నవారిని సహాయబృందాలు వెలికి తీస్తున్నాయి.
 
సిచుయాన్‌ రాష్ట్రంలో సంభవించిన ఈ భూప్రకోపానికి లక్షలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూమి లోపల 20 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 2008లో ఇదే ప్రాంతంలో సంభవించిన భూకంపానికి ఏకంగా 70వేలమంది ప్రాణాలు కోల్పోయారు.