ప్లీజ్ నాన్నా... నా శీలాన్ని పాడు చేయొద్దు... 13 యేళ్ళ బాలికపై తండ్రి అత్యాచారం
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ కామాంధుడు తండ్రి అన్న పదానికే మచ్చతెచ్చాడు. కన్నకూతురిపైనే మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ.. ఆమెకు నరకయాతన చూపించాడు. ఇలాంటి పాడుపని చేయొద్దని 13 ఏళ్ల ఆ బాలిక ఎంతగా ప్రాధేయపడ్డా కూడా. ఆ మానవమృగం ఏమాత్రం కనికరించకుండా మరింత హింసించాడు.
అంతేకాకుండా గుర్తుతెలియని వారితోనూ బాలికపై అత్యాచారం చేయించి, ఆ దుర్మార్గాన్ని స్వయంగా వీడియో తీశాడు. కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడిన ఈ కామాంధుడికి ఆస్ట్రేలియా కోర్టు ఇరవై రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. తన బిడ్డను ఎవరన్నా చిన్న మాటంటేనే కన్న తండ్రికి రక్తం ఉడికిపోతుంది.
అలాంటిది ఈ కామక్రూరుడు తాను అత్యాచారం చేయడమే కాకుండా ఆన్లైన్లో తనకు పరిచయమైన వారిని పిలిపించి.. వారు కూతురిని చిత్రహింసలు పెడుతుంటే... ఆనందంతో కేరింతలు కొడుతూ వీడియో తీశాడు. ఆ వీడియో తనకు వినోదాన్ని పంచిందంటూ పోలీసుల విచారణలో తన రాక్షసత్వాన్ని బయటపెట్టాడు.
2013 నుంచి 2015 మధ్య కుమార్తెపై జరిపిన దారుణాలకు సంబంధించి 61 కేసులు నమోదుకాగా.. వాటిని ఆ నిందితుడు అంగీకరించాడని ప్రాసిక్యూషన్ న్యాయవాది వెల్లడించారు. 2013-15 మధ్యకాలంలో 11 నుంచి 13 ఏళ్ల మధ్య వయస్సున్న తన కూతురిపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు అంగీకరించాడు.
బాధితురాలి పేరు రహస్యంగా ఉంచే ఉద్దేశంతో కోర్టు నిందితుడి పేరును వెల్లడించలేదు. 42 ఏళ్ల ఈ కామాందుడి దుశ్చర్యలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలనూ న్యాయమూర్తి కోర్టులో పరిశీలించారు. ఆ కూతురు తనపై అఘాయిత్యం చేస్తున్నప్పుడు "వద్దు నాన్నా" అని జాలిగా వేడుకుంటూ ఉండటం చూసిన న్యాయమూర్తి ఫిలిప్ ఈటన్ తల్లడిల్లిపోయారు. ఈ కామాంధుడికి ఇంతకన్నా పెద్ద శిక్షే వేయాలనుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన కామాంధుల్లో ఓ చర్చి పాస్టర్ కూడా ఉన్నాడు. అతనికి కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించి తీర్పునిచ్చింది.