శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 నవంబరు 2021 (08:56 IST)

నిజమైన తోకతో జన్మించిన వింత శిశువు... ఎక్కడ?

కొందరు పిల్లలు వింత వింతగా జన్మిస్తుంటారు. కొందరి రెండు తలలు, మూడు కాళ్లు ఇలా ఏదో ఒక వింత ఆకారం ఉంటుంది. తాజాగా ఓ బాలుడు నిజమైన తోకతో జన్మించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది. 
 
ఈ దేశంలోని ఫోర్టలెజా పట్టణానికి చెందిన నిండు గర్భిణి ఒకరు ఆల్బెర్ట్ సాబిన్ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. సాధారణ కాన్పునకు అవకాశం లేకపోవడంతో శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ఆ బాలుడికి మతోక ఉండడం చూసిన వైద్యులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. 
 
ఈ తోక పొడవు 12 సెంటీమీటర్ల వుంది. ఆ తోక చివర్లో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతిలాంటి ఆకారం కూడా ఉండడం వైద్యులను ఆశ్చర్యపరిచింది. మహిళ గర్భం దాల్చిన తర్వాత అదే ఆసుపత్రిలో తరచూ పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఎప్పుడూ ఆ తోకను గుర్తించలేదని వైద్యులు తెలిపారు. 
 
దీనిని ‘నిజమైన మానవతోక’గా అభివర్ణిస్తున్న వైద్యులు.. ఆ తోకకు నాడీ వ్యవస్థకు ఎలాంటి అనుసంధానం లేదని, చర్మానికి మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. ఆపరేషన్ చేసి ఆ తోకను తొలగించినట్టు చెప్పారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.