మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జులై 2015 (13:39 IST)

సోషల్ మీడియాలో హంగామా చేసిన చిన్న గుడ్లగూబ చేష్టలు.. ఏం చేసింది..?

సోషల్ మీడియాలో ఓ చిన్న గుడ్లగూబ హంగామా చేసింది. తల్లి నుంచి వేరుపడిన ఓ చిన్న గుడ్లగూబ.. రోడ్డుపైకి వచ్చింది. తన చేష్టలతో సోషల్ మీడియాలో హంగామా సృష్టించింది. అమెరికాలోని కోలరాడా పరిధిలో బౌల్డర్ కౌంటీ పోలీసు విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ చేస్తుంటే, రోడ్డుపై ఓ చిన్న గుడ్లగూబ పిల్ల కనిపించింది. దాని దగ్గరకు సోఫీ బెర్నమ్ అనే ఆ మహిళా పోలీసు వెళితే, వింతగా చూసింది.
 
''వాట్స్ అప్?'' అని అడిగితే, తల అటూ ఇటూ తిప్పింది. సెల్యూట్ చేస్తున్నట్టు పలుమార్లు నడుం వంచింది. ఈ దృశ్యాలన్నీ ఆ పోలీసు ధరించిన బటన్ కెమెరాలో రికార్డయ్యాయి. దీన్ని సోషల్ మీడియాలో ఉంచితే 32 లక్షల మంది తిలకించారు. దీంతో ఆ గుడ్లగూబ పిల్లకు సెలబ్రిటీ హోదా వచ్చేసింది. ఇకపోతే.. బౌల్డర్ కౌంటీ షరీఫ్ అధికార ట్విట్టర్ పేజీలో వీడియోను, ఫోటోలను పెట్టారు. ఈ  ఫోటోలకు, వీడియోకు భారీ స్పందన లభిస్తోంది.