బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (12:55 IST)

బంగ్లాదేశ్ నిరసనల్లో విరాట్ కోహ్లీ డూప్!! ఫోటో వైరల్!!

doop virat kohli
కల్లోల దేశంగా మారిన బంగ్లాదేశ్‌లో నిరసనలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆ దేశ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తారా స్థాయికి చేరాయి. అయితే, ఈ నిరసనల్లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పోలిన వ్యక్తి కనిపిస్తున్నారు. అచ్చం విరాట్ కోహ్లీని పోలివుండటంతో విరాట్ కోహ్లీ డూప్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆయన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో డూప్ విరాట్ కోహ్లీతో పాటు.. వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అయింది. 
 
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని పోలివుండటమే కాదు... నిరసనల్లో కూడా పాల్గొంటున్నాడు. దీంతో కోహ్లీకి డూప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పైగా, ఈ నిరసనలో పాల్గొనడటమే కాకుండా రాయల్ చాలెంజర్స్ క్యాప్‌ను ధరించిన ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో డూప్ విరాట్ కోహ్లీ వీడియో వైరల్ అయింది.
 
కాగా, దేశ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో అక్కడి విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాల్లో కోహ్లీని పోలిన వ్యక్తి కూడా ఉన్నాడు. మరోవైపు, దేశ వ్యాప్తంగా హింసాత్మక సంఘటనలో చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థులు అవామీ లీగ్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడంతో పాటు ఏకంగా దేశాన్ని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది.