శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 13 నవంబరు 2017 (16:44 IST)

మహిళ అకౌంట్ లోకి రూ.125 కోట్లు.. ఏం చేసిందంటే...

చేతిలో చిల్లిగవ్వ లేకప్పుడు ఎవరైనా అప్పు ఇస్తే బాగుండు అనుకుంటాం. అలా జరుగకుండా మన బ్యాంక్ అకౌంట్‌లో కొన్ని కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చి పడితే ఎంత బాగుంటుంది కదా. అప్పుడు మనం సాధారణ మనిషిలాగా ఆలోచించం. నిజానికి అలా ఎందుకు జరుగుతుంది చెప్పండి. బ్యాంకు

చేతిలో చిల్లిగవ్వ లేకప్పుడు ఎవరైనా అప్పు ఇస్తే బాగుండు అనుకుంటాం. అలా జరుగకుండా మన బ్యాంక్ అకౌంట్‌లో కొన్ని కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చి పడితే ఎంత బాగుంటుంది కదా. అప్పుడు మనం సాధారణ మనిషిలాగా ఆలోచించం. నిజానికి అలా ఎందుకు జరుగుతుంది చెప్పండి. బ్యాంకులు ముక్కుపిండి మరీ ఛార్జీలను వసూలు చేస్తాయి. కానీ అంత మొత్తంలో పొరపాటున డబ్బును అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాయా అంటే ఒక్కోసారి నిజం కావచ్చు. అలాంటిదే ఒక యువతికి జరిగింది.
 
ఆస్ట్రేలియాకు చెందిన క్లేక్ వేన్ వైట్ అనే మహిళకి నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. ఆమె ఒక న్యాయవాది. కష్టాల్లో ఉన్న సమయంలో ఆమెకు 25 మిలియన్ డాలర్లు ఒక్కసారిగా అకౌంట్‌లో పడ్డాయి. అది కూడా బ్యాంకు అధికారులే స్వయంగా ఆ డబ్బులను ట్రాన్ఫర్ చేశారు. తనకు పడిన మొత్తాన్ని చూసి ఆశ్చర్చపోయారు. వెంటనే తన మినీ స్టేట్‌మెంట్‌ను ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది అలా అలా బ్యాంకు వరకు వెళ్ళింది. 
 
క్లేక్ వెన్ వైట్‌కు లోన్ కింద 2,500 డాలర్లను మాత్రమే చెల్లించాలి. బ్యాంకు సిబ్బంది తప్పిదం వల్ల 2,500కు బదులు 25 మిలియన్ డాలర్లను ట్రాన్ఫర్ చేశారు. అయితే ఆమె మాత్రం నిజాయితీగా వ్యవహరించారు.  బ్యాంకు సిబ్బందినే తన అకౌంట్ నుంచే డబ్బులు తీసేసుకోమని లెటర్ రాసిచ్చారు.