శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (12:48 IST)

కొడుకుతో పెళ్లి... కుమార్తెతో లైంగిక సంబంధం.. ఓ కన్నతల్లి నిర్వాకం

అమెరికాలోని ఓక్లహోమాకు చెందిన ఓ కన్నతల్లి వావివరసలు పూర్తిగా విస్మరించింది. లింగభేదం మరచి కుమార్తెతో లైంగికబంధం పెట్టుకుంది. ఆ తర్వాత 18 యేళ్ల కుమారుడిని తన శృంగార చేష్టలతో రెచ్చగొట్టి పెళ్లి చేసుకుంద

అమెరికాలోని ఓక్లహోమాకు చెందిన ఓ కన్నతల్లి వావివరసలు పూర్తిగా విస్మరించింది. లింగభేదం మరచి కుమార్తెతో లైంగికబంధం పెట్టుకుంది. ఆ తర్వాత 18 యేళ్ల కుమారుడిని తన శృంగార చేష్టలతో రెచ్చగొట్టి పెళ్లి చేసుకుంది. ఈ చర్య మానవసంబంధాలకే మాయనిమచ్చలా మారినప్పటికీ... ఆమె మాత్రం తన చర్యను సమర్థించుకుంటోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే....
 
అమెరికాలో పాట్రిసియా స్పాన్ అనే 44 ఏళ్ల మహిళకు 30 ఏళ్ల కిందట ఓ వ్యక్తితో పెళ్లయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే భర్తతో విభేదాలు వచ్చి తెగదెంపులు చేసుకుంది. అప్పటికే ఆమెకు ఒక పాప, ఇద్దరు బాబులు ఉన్నారు. ఆ పిల్లలందరూ వాళ్ల నాయనమ్మ దగ్గర పెరిగారు. 
 
ఆ తర్వాత 28 యేళ్ళ పెద్ద కుమార్తె మిస్టీ స్పాన్‌తో తనవద్దకు తీసుకొచ్చి అక్రమసంబంధం పెట్టుకుంది. లింగబేధం మరిచి ఆమెతో లైంగిక కార్యకలాపాలు సాగిస్తూ వచ్చింది. ఈ విషయం ఇరుగుపొరుగువారి దృష్టికి రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు నోరెళ్లబెట్టే నిజం ఒకటి తెలిసింది. 2008వ సంవత్సరంలో 18 ఏళ్ల వయసున్న ఆమె పెద్ద కుమారుడిని కూడా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 15 నెలల్లోనే వారి మధ్య విబేధాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాతే కుమార్తెతో సంబంధం పెట్టుకున్నట్టు విచారణలో వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన తర్వాత పోలీసులు ఆమెపై కేసునమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. 
 
తల్లీకూతుళ్లను విచారించిన అనంతరం ఇద్దరికీ పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తన తప్పేమీ లేదని కుమార్తె విన్నవించుకోండంతో కనికరించిన న్యాయమూర్తి.. ఆమె శిక్షను రెండేళ్లకు తగ్గించారు. తల్లికి వేయబోయే శిక్ష గురించి వచ్చే యేడాది జనవరిలో తుదితీర్పును ఇవ్వనున్నారు.