బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (10:39 IST)

పెషావర్ యువకులకు షాక్.. హెయిర్ కట్‌లో ఇక నో-స్టైల్

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఓ కొత్త నిబంధన అమలైంది. ఈ కొత్త రూల్ ప్రకారం ఇష్టమొచ్చినట్లు స్టయిల్‌గా గడ్డం గీసుకోవడం కుదరదు. దీంతో యువకులు ఇక స్టైల్‌గా చేయించుకునే హెయిర్ స్టైల్‌కు బ్రేక్ పడినట్లైంది. గ

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఓ కొత్త నిబంధన అమలైంది. ఈ కొత్త రూల్ ప్రకారం ఇష్టమొచ్చినట్లు స్టయిల్‌గా గడ్డం గీసుకోవడం కుదరదు. దీంతో యువకులు ఇక స్టైల్‌గా చేయించుకునే హెయిర్ స్టైల్‌కు బ్రేక్ పడినట్లైంది. గడ్డం గీసుకోవడం.. హెయిర్ స్టయిల్ చేయించుకోవడం ఇకపై యువకుల ఇష్ట ప్రకారం వుండదని పెషావర్ బార్బర్లు చెప్పేశారు. 
 
అంతేగాకుండా తాను ఇస్లాం సంప్రదాయం ప్రకారమే హెయిర్ కట్ చేస్తామని బార్బర్ల సంఘాలు ఓ తీర్మానం చేసి.. ప్రకటన వెలువరించాయి. పెషావర్‌లో ఇస్లాం సంప్రదాయ పరంగానే హెయిర్ కట్ చేయాలని తాలిబన్లు దాడులు చేసి బెదిరించేవారు. ప్రస్తుతం అలాంటి దాడులు లేకపోయినా.. బార్బర్ సంఘాలు యువకులకు సంప్రదాయ హెయిర్ కట్ చేస్తామని స్పష్టం చేశారు.