శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (16:21 IST)

జింకను కొండచిలువ మింగేసింది.. తర్వాత ఏమైంది? (ఫోటో)

కొండచిలువ కోళ్లను, మేకలను మింగేసే దాఖలాలున్నాయి. అయితే నైరుతి ఫ్లోరిడాలో ఓ కొండ చిలువ ఏకంగా జింకనే మింగేసింది. ఇంకేముంది? జింకను మింగిన కొండచిలువ బతికే వుందా? అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. కన్స

కొండచిలువ కోళ్లను, మేకలను మింగేసే దాఖలాలున్నాయి. అయితే నైరుతి ఫ్లోరిడాలో ఓ కొండ చిలువ ఏకంగా జింకనే మింగేసింది. ఇంకేముంది? జింకను మింగిన కొండచిలువ బతికే వుందా? అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. కన్సర్వెన్సీ ఆఫ్ సౌత్ వెస్ట్ ఫ్లారిడాకు చెందిన జాతీయ పార్కు అధికారులు ఇచ్చిన వివరాల్లోకి వెళితే.. కొలియర్ ఫారెస్ట్‌లో జింకను.. కొండచిలువ మింగేసింది. 
 
15.88 కిలోల బరువున్న జింకను 14.29 కిలోల కొండ చిలువ మింగేయడాన్ని అధికారులు డాక్యుమెంట్ రూపంలో విడుదల చేశారు. ఈ డాక్యుమెంట్లో కొండచిలువ జింకను మింగేసిందని గుర్తించిన అధికారులు.. దాని పొట్టను కోసి మరణించిన జింకను బయటికి తీసేశారు. తిరిగి కొండ చిలువ పొట్టకు శస్త్ర చికిత్స చేసి కాపాడారు. కొండ చిలువలు భారీగా ఆహారాన్ని తీసుకుంటాయని.. కానీ జింకలా అతిపెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడం ఇతే తొలిసారని అధికారులు చెప్పుకొచ్చారు.