ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2016 (11:23 IST)

చైనాకు బీజేపీ వార్నింగ్ : మేము కావాలో పాకిస్థాన్ కావాలో తేల్చుకోండి

పొరుగు దేశం చైనాకు భారతీయ జనతా పార్టీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. జైషే తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌కు చైనా బహిరంగంగా మద్దతు పలకడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఐక్యరాజ్య సమితిలో తనకున్న వీటో అధికార

పొరుగు దేశం చైనాకు భారతీయ జనతా పార్టీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. జైషే తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌కు చైనా బహిరంగంగా మద్దతు పలకడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఐక్యరాజ్య సమితిలో తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి చైనా.. మసూద్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది అనే ముద్ర వేయకుండా అడ్డుకుంది. ఫలితంగా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 
 
బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ మాట్లాడుతూ... ఉగ్రవాదం, ద్వైపాక్షిక బంధం ఒకే మార్గంలో ప్రయాణించలేవని, భారత్, పాకిస్థాన్ దేశాల్లో ఎవరు కావాలన్నది చైనా తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. సాంకేతిక కారణాలున్నాయన్న సాకును చూపుతూ, జైషే మహ్మమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఐరాసను చైనా తన వీటో హక్కుతో అడ్డుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఉగ్రవాదంపై పోరాడుతున్న ఇండియాతో ద్వైపాక్షిక బంధం కావాలో లేదా, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌తో చెలిమే కావాలో చైనా నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. పాక్‌తో బంధాన్ని కొనసాగించాలని భావిస్తే, అది ఇండియా - చైనా మధ్య ఉన్న బలమైన వ్యాపార బంధం తెగేందుకు కారణమవుతుందని గమనించాలని ఆయన హెచ్చరించారు.