శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జులై 2023 (11:13 IST)

ఫిట్‌నెస్ ట్రైనర్ మృతి.. 210 కేజీల బ‌రువు పైన పడితే..?

Fitness Trainer
Fitness Trainer
ఇండోనేషియాలోని బాలిలో ఓ ఫిట్‌నెట్ ట్రైనర్ ప్రాణాలు కోల్పోయాడు. 33 ఏళ్ల జ‌స్టిన్ విక్కీ.. బార్బెల్ ఎత్తుతుండగా అదికాస్తా అత‌డి మెడ‌పై ప‌డ‌డంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. స్క్వాట్‌ప్రెస్ కోసం విక్కీ 210 కేజీల బ‌రువున్న‌ బార్బెల్‌ను ఎత్తి త‌న భుజాల‌పై పెట్టుకున్నాడు.
 
అయితే, అంత బ‌రువును కాయడంలో బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడడంతో, బార్బెల్ అత‌డి మెడ‌పై ప‌డింది. దీంతో మెడ విరిగి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత్య‌వ‌స‌ర ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. అయితే, ఆ త‌ర్వాత కాసేప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయాడు.