బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జులై 2023 (11:47 IST)

ఎల్ సాల్వడర్‌లో భారీ భూకంపం... భూకంప లేఖినిపై 7.5గా నమోదు

earthquake
లాటిన్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడర్‌లో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ మహాసముద్ర తీరంలోని ఎల్ సాల్వడర్ ప్రాదేశిక సముద్ర జలాల్లో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ ప్రకంపనల తీవ్రత భూకంప లేఖిని 7.5గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్ర గర్భంలో 70 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపారు. దేశ రాజధాని సాన్ సాల్విడర్‌ సమీపంలోని సముద్ర తీర పట్టణమైన లా లిబర్టెడ్ కూడా భూమి కంపించిందని అధికారులు తెలిపారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిళ్ల లేదని, సునామీ వచ్చే అవకాశం లేదని వెల్లడించారు. 
 
మరోవైపు, పసిఫిక్ తీరంలో భూకంపం ప్రభావంతో నికరాగువా, హోండురస్, గ్వాటెమాలా, బ్రెజిల్లో కూడా స్వల్పంగా కదలికలు సంభవించాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీచేయలేదన్నారు. గత ఆదివారం అమెరికాలోని అలస్కాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత నమోదైంది. అలస్కా పరిధిలోని పెనిన్సులా ప్రాంతంలో దీని ప్రభావం కనిపించింది. దీంతో జియోలాజికల్ సర్వే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.