సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (19:31 IST)

ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. గోధుమ పిండి రేటుకు రెక్కలు

పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోంభంలో చిక్కుకుపోవడం ఆహారం దొరకకుండా జనం నానా తంటాలు పడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరగడంతో ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇందులో భాగంగా పాకిస్థానీయులు ఇష్టంగా తినే చపాతీల కోసం వాడే గోధుమల రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. 
 
గోధుమ పండి ధరలు భారీగా పెరిగాయి. ఎంతలా అంటే కిలో పిండి కొనాలంటే అక్కడి ప్రజలు రూ.320 వెచ్చించాల్సిందే. దీంతో ప్రపంచంలోనే గోధుమ పిండి ధరలు అత్యధికంగా పాక్‌లోనే ఉన్నాయని పాకిస్థాన్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ వెల్లడించింది. 
 
దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో రూ.200 అధికమైన 20 కిలోల గోధుమ పిండి బస్తా ధర రూ.3200కు చేరింది.