శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:31 IST)

అతడితో ఒక్క రాత్రి శృంగారం... ఆమె జీవితాన్ని మార్చేసింది...

2016 రియో ఒలంపిక్స్‌లో జరిగిన ఒక సంఘటన కారణంగా ఓ మహిళా డైవర్‌కి నీలి చిత్రాల్లో నటించమని ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి వస్తోందట. అంతేకాకుండా నీలి చిత్రాల వీడియోలను కూడా ఆకతాయిలు ఆమెకు పంపుతున్నారట. ఆ ఒలింపిక్స్ సమయంలో ఆటగాళ్లందరికీ కండోమ్స్ ఇచ్చారనే సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే ఆటగాళ్లు శృంగారంలో విచ్చలవిడిగా పాల్గొంటారని నిర్వాహకులకు ముందుగానే తెలుసు.
 
బ్రెజిల్ దేశానికి చెందిన 22 ఏళ్ల డైవర్ ఇన్‌గ్రిడ్ ఒలివేరా కూడా అలాంటి పని చేసింది. ఒలివేరా పెడ్రో గాన్‌కాల్వ్స్‌తో రాత్రంతా శృంగారంలో పాల్గొందని, మారథాన్ నైట్ ఆఫ్ సెక్స్ నడిపిందని అప్పట్లో బ్రెజిలియన్ మీడియా కోడై కూసింది. అంతేకాకుండా తనతో పాటు గదిని పంచుకున్న పెడ్రోసో అనే క్రీడాకారిణిని కూడా గది నుండి వెళ్లగొట్టిందని పత్రికల్లో రాసారు. అయితే ఆ రోజు ఏమి జరిగిందో ఇప్పటివరకు రెండున్నర సంవత్సరాలుగా బయటకి చెప్పని ఒలివేరా ఒక్కసారిగా తనలో దాగి ఉన్న ఆ విషయాలను బయటకు చెప్పింది.
 
ఆ రోజు తాను ఆమెను వెళ్లగొట్టలేదని, అలాగే తమకు ఇష్టమైన వారిని తమతో పాటుగా గదిలోకి తీసుకువెళ్లవచ్చని, అందరూ అదే చేసారని, ఒలింపిక్స్ నిర్వాహకులు సైతం కండోమ్స్ ఇవ్వడం కూడా ప్రత్యేకత సంతరించుకుందని పేర్కొంది. అంతేకాకుండా గాన్‌కాల్వ్స్‌తో రాత్రి సెక్సులో పాల్గొన్నానని, పెడ్రాసోనిని మాత్రం వెళ్లగొట్టలేదని చెప్పింది. ఒలింపిక్ పోటీలలో ఒలివేరా చివరి స్థానంలో నిలిచింది. అందరూ ఆమెను బాగా తిట్టిపోసారు. మరోపక్క ఆమెతో పడక సుఖాన్ని అనుభవించిన గాన్‌కాల్వ్స్‌ను మాత్రం ఆకాశానికెత్తేసారు.
 
అప్పటి నుండి అందరూ తనను దూషిస్తున్నారని, ఇంటర్నెట్‌లో అసభ్యకరంగా కామెంట్‌లు పెడుతున్నారని, అలాగే సెక్స్ చిత్రాలలో నటించాల్సిందిగా ప్రపోజల్స్ పెడుతున్నారని వాపోయింది. తాను స్త్రీ కావడం అలాగే శృంగారంలో పాల్గొనడం వల్లే తాను పనిని కోల్పోయానిని, సెక్స్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి వస్తోందని, ఇలాంటి దుస్థితి ఎదుర్కోవాల్సి వస్తోందని తాను కలలో కూడా ఊహించలేదని వాపోయింది.