ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2017 (16:17 IST)

టీనేజీలో లవ్ ఫెయిల్.. సరైన వరుడు దొరకలేదు.. సెల్ఫ్ మ్యారేజ్‌కు రెడీ.. రోమ్‌లో శోభనం..

టీనేజీలో లవ్ ఫెయిల్. పెళ్ళి కోసం 40 సంవత్సరాలు వేచి చూసింది. కానీ వరుడు దొరకలేదు. ఇక లాభం లేదనుకున్న ఆ మహిళ సెల్ఫీ మ్యారేజ్‌కు రెడీ అయిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన 39 ఏళ్ల లిన్నే-ల

టీనేజీలో లవ్ ఫెయిల్. పెళ్ళి కోసం 40 సంవత్సరాలు వేచి చూసింది. కానీ వరుడు దొరకలేదు. ఇక లాభం లేదనుకున్న ఆ మహిళ సెల్ఫీ మ్యారేజ్‌కు రెడీ అయిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన 39 ఏళ్ల లిన్నే-లాస్ అనే మహిళ టీనేజీలో ప్రేమలో పడి విఫలమైంది. అనంతరం యుక్తవయస్సులో పెళ్లి చేసుకోవాలనుకున్నా.. సరైన వరుడు మాత్రం దొరకలేదు. ప్రస్తుతం ఒంటరి జీవితాన్నే గడుపుతోంది. 
 
అయితే లిన్నా సెల్ఫ్ మ్యారేజ్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసింది. ఆమె 40వ పుట్టిన రోజు ఏప్రిల్-08న పెళ్లి తనను తానే (సెల్ఫ్ మ్యారేజ్) పెళ్లి చేసుకుంటున్నట్లు బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో బంధువులందరికీ ఆహ్వానం పంపింది. లిన్నే నిర్ణయానికి పెద్దలు కూడా అంగీకరించారు. ప్రస్తుతానికి లిన్నే బిజినెస్ అనలిస్ట్‌గా ఉద్యోగం చేస్తోంది. ఇక సెల్ఫ్ మ్యారేజ్‌కు కావాల్సిన ఆభరణాలు.. దుస్తులు కొనే పనుల్లో అమ్మడు బిజీగా ఉంది. 
 
అంతేకాదండోయ్.. శోభనాన్ని రోమ్‌లో జరుపుకునేందుకు సర్వం సిద్ధం  చేసుకుందట. సెల్ఫ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. సరైన వరుడు దొరకలేదని.. టీనేజ్ లవ్‌ ఫెయిల్ అయ్యిందని.. ఇలా 40 ఏళ్లు ఒంటరి జీవనం గడిచిపోయిందని.. ఇక లాభం లేదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పుకొచ్చింది.