మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (09:22 IST)

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి భార్యతో డోనాల్డ్ ట్రంప్‌కు ఎఫైర్ ఉందా?

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టకముందు డోనాల్డ్ ట్రంప్ మంచి శృంగారపురుషుడే. ఆ దేశంలో పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తల్లో ఈయన ఒకరు. పైగా, అనేక మందితో రాసలీలలు జరిపినట్టు ఆరోపణలు లేకపోలేదు.

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టకముందు డోనాల్డ్ ట్రంప్ మంచి శృంగారపురుషుడే. ఆ దేశంలో పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తల్లో ఈయన ఒకరు. పైగా, అనేక మందితో రాసలీలలు జరిపినట్టు ఆరోపణలు లేకపోలేదు. ఈ కోవలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పని చేసిన నికోలస్ సర్కోజీ భార్య, పాప్ సింగర్ కార్లా బ్రూనీతో కూడా ఈయనగారి ఎఫైర్ ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. పైగా, ట్రంప్‌ తన రెండో భార్య మార్లా మాప్లెస్‌తో విడిపోవడానికి కార్లా కారణమని గతంలో వార్తలు వచ్చాయి. వీటిపై ట్రంప్ మాత్రం ఎక్కడా నోరు విప్పలేదు. కానీ, కార్లా బ్రూనీ మాత్రం తాజాగా స్పందించారు. 
 
ఈ ఎఫైర్ వ్యవహారంపై కార్లా బ్రూనీ స్పందిస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌తో తనకు ఎప్పుడూ ఎఫైర్‌ లేదని బ్రూనీ స్పష్టం చేశారు. 'ఈ మొత్తం వ్యవహారం అస్పష్టంగా ఉంది. ట్రంప్‌ మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడినపుడు చాలా ఆశ్చర్యపోయాను' అని అన్నారు. 2008లో ఆమె సర్కోజీని వివాహం చేసుకున్నారు. కార్లాకు 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.