మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 28 జనవరి 2018 (11:17 IST)

డోక్లామ్‌ వద్ద చైనా దూకుడు.. భారత్ చర్యలు భేష్.. అమెరికా

డోక్లామ్‌కు అతిదగ్గరగా చైనా యుద్ధ విమానాలు మోహరించిన తర్వాత.. భారత్ తీసుకున్న చర్యలపై అమెరికా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భారత్, చైనా, టిబెట్ సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్‌కు సమీపంలోని తన దేశ పరిధిలో ఆగమే

డోక్లామ్‌కు అతిదగ్గరగా చైనా యుద్ధ విమానాలు మోహరించిన తర్వాత.. భారత్ తీసుకున్న చర్యలపై అమెరికా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భారత్, చైనా, టిబెట్ సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్‌కు సమీపంలోని తన దేశ పరిధిలో ఆగమేఘాల మీద ఓ రన్ వేను నిర్మించి దాదాపు 40 యుద్ధ విమానాలను చైనా అక్కడికి పంపింది.

అయితే చైనాకు చెక్ పెట్టేలా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డోక్లామ్‌కు సమీపంలోని పశ్చిమ బెంగాల్‌లో వున్న హసీమర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను భారత్ భారీగా అభివృద్ధి చేసింది. 
 
సుఖోయ్ యుద్ధ విమానాలను అక్కడ మోహరించింది. దాదాపు 30 విమానాలను అక్కడకు పంపింది. సుఖోయ్‌లతో  పాటు బ్రహ్మోస్ క్షిపణలను కూడా చేర్చింది. దీంతో వెనక్కి తగ్గిన చైనా.. తమ యుద్ధ విమానాలను వెనక్కి తీసుకోక తప్పలేదు. 
 
ఈ మొత్తం వ్యవహారాన్ని అమెరికా నిఘా శాటిలైట్లు కూడా గమనించాయి. చైనా దూకుడుగా వ్యవహరించినా.. భారత్ సంయమనంగా వ్యవహరించిందని.. భారత్ తీసుకున్న చర్యలు భేష్ అంటూ అమెరికా అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.