శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 27 జనవరి 2018 (09:35 IST)

పెరుగుతున్న యూపీఏ బలం.. తగ్గుతున్న మోడీ హవా

దేశవ్యాప్తంగా యూపీఏ బలం పెరుగుతోంది. మరోవైపు అధికార బీజేపీ హవా తగ్గిపోతోందట. మూడ్ ఆప్ ది నేషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. లోక్‌నీతి-సీఎస్‌డీఎస్-ఏబీపీ కలిసి ఈ సర్వే నిర్వహించడం జరిగింది.

దేశవ్యాప్తంగా యూపీఏ బలం పెరుగుతోంది. మరోవైపు అధికార బీజేపీ హవా తగ్గిపోతోందట. మూడ్ ఆప్ ది నేషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. లోక్‌నీతి-సీఎస్‌డీఎస్-ఏబీపీ కలిసి ఈ సర్వే నిర్వహించడం జరిగింది. 
 
గతేడాది నిర్వహించిన సర్వే ఫలితాలతో తాజా పరిస్థితిని పోల్చి చూసినప్పుడు ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న ఆకర్షణ తగ్గుతున్నట్టు తేలింది. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చిన సర్వే ఈసారి మాత్రం మోడీ ప్రభంజనం ఉండదని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు మాత్రం బీజేపీ దక్కించుకుంటుందని స్పష్టం చేసింది. ఎన్డీఏ కూటమికి 293 నుంచి 309 స్థానాలు వస్తాయని తెలిపింది.
 
అదేసమయంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ 59 స్థానాల్లో విజయం సాధించగా, ఈసారి యూపీఏ బలం 122 నుంచి 132కు పెరుగుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీకి ప్రజల్లో ఆదరణ క్రమంగా పెరుగుతోంది. 8 నెలల క్రితం ప్రధానిగా రాహుల్‌కు 9 శాతం మంది ఓటు వేయగా, ఇప్పుడది 20 శాతానికి చేరుకోవడం గమనార్హం.