శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (11:42 IST)

మారని చైనా వక్రబుద్ధి.. కార్గో విమానాలకు బ్రేక్.. 15 రోజుల తరువాత..?

కరోనాను ప్రపంచ దేశాలకు వ్యాపింపజేసిన చైనా వక్రబుద్ధి మారట్లేదు. కరోనా కష్టసమయంలోనూ డ్రాగన్ కంట్రీ తన బుద్ధేంటో చాటుకుంది. భారత్‌‌కు అండగా ఉంటామని బహిరంగంగా ప్రకటించిందో లేదో అంతలోనే చేతులెత్తేసింది. భారత్‌ను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన చైనా.. కొత్త పాట పాడింది. 
 
భారత్‌‌లో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ఇతర మెడికల్‌ ఎక్విప్‌ మెంట్‌ కొరత కారణంగా కేంద‍్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది.
 
మనదేశానికి చెందిన పలు ప్రైవేట్‌ సంస్థలు ఇప్పటికే చైనా కంపెనీలతో సంప్రదింపులు జరిపాయి. డ్రాగన్‌ కంట్రీ నుంచి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు పాటూ ఇతర మెడికల్‌ ఎక్విప్‌ మెం‍ట్‌  భారత్‌ రావాల్సి ఉంది. 
 
కానీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, కార్గో విమానాలన్నింటిని 15 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సిచువాన్‌ ఎయిర్‌ లైన్స్‌‌లో భాగమైన సిచువాన్‌ చువాన్‌హాంగ్‌ లాజిస్టిక్స్‌ లేఖ రాసింది. సేల్స్‌ ఏంజెట్లకు రాసిన లేఖలో చైనా నుంచి ఢిల్లీకి వచ్చే ఆరు రవాణా మార్గాల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. 
 
భారత్‌‌లో కరోనా పరిస్థితులను క్యాష్‌ చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. భారత్‌‌కు పంపే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల, ఇతర మెడికల్‌ ఎక్విప్‌ మెంట్‌ ధరల్ని 35 నుంచి 40 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది. సరుకు రవాణా ఛార్జీలను 20 శాతానికి పెంచినట్లు షాంఘైకి చెందిన సినో గ్లోబల్ లాజిస్టిక్స్‌ సంస్థ ప్రతినిధి సిద్ధార్థ్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు.
 
సిచువాన్ ఎయిర్‌లైన్స్ మాట్లాడుతూ.. భారత మార్గం ఎల్లప్పుడూ ప్రధాన వ్యూహాత్మక మార్గం. ఈ సస్పెన్షన్ మా కంపెనీకి కూడా చాలా నష్టాన్ని కలిగించింది. 15 రోజుల తరువాత కంపెనీ పరిస్థితిని సమీక్షిస్తుందని లేఖలో పేర్కొంది.