సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (12:50 IST)

పెళ్లి చేసుకునే వారికి చైనా రివార్డ్.. పిల్లల్ని కనే వారికి..?

marriage
పెళ్లి చేసుకునే వారికి చైనా రివార్డ్ ప్రకటించింది. జననాల రేటు ఆందోళనకర స్థాయిలో వున్నందున 25 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న అమ్మాయులను పెళ్లి చేసుకుంటే 1,000 యువాన్లు, మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 11,341 క్యాష్ ప్రైజ్ బహుమానంగా ఇస్తోంది. దీంతో పాటు భార్యాభర్తలకు ప్రభుత్వ పథకాలు, పిల్లలకు ఆరోగ్య సేవల సదుపాయం కల్పిస్తోంది.
 
చైనాలో పెళ్లి పట్ల యువత అనాసక్తి కనబరుస్తున్నారు. దీంతో 2022 లో చైనాలో పెళ్లిళ్ల రేటు 68 లక్షలకు పడిపోయింది. చైనా జనాభా పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండంటతో భవిష్యత్తును దృష్టిల్లో ఉంచుకుని యువత త్వరగా పెళ్లి చేసుకునేలా కొత్త పథకాలు తీసుకొస్తోంది చైనా ప్రభుత్వం. ఎక్కువ మంది పిల్లల్ని కనే వారికి ఇప్పటికే నగదు బహుమానాలు కూడా అందిస్తోంది.