గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (11:13 IST)

ఎయిర్ హోస్టెస్ చాక్లెట్ ఆఫర్‌పై ఎంఎస్ ధోని ఏమన్నాడంటే..? (video)

MS Dhoni
MS Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అసాధారణమైన క్రికెట్ నైపుణ్యంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించి పెట్టాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 
ఒక ఎయిర్ హోస్టెస్ ధోనీకి రుచికరమైన చాక్లెట్ల పెట్టెను అందజేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. వీడియోలో ధోనీ స్పందన నిజంగా వెలకట్టలేనిది.
 
వైరల్ అవుతున్న వీడియోలో.. ఎయిర్ హోస్టెస్ చాక్లెట్లతో ఉన్న ట్రే పట్టుకుని ధోనీ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో ధోనీ క్యాండీ క్రష్ ఆడుతున్నాడు. ఆ ట్రేను చూసిన ధోనీ చిరునవ్వు నవ్వి ఒక్క చాక్లెట్ మాత్రం తీసుకుని చాలు అన్నట్టు సైగ చేశాడు. 
 
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొద్ది గంటల్లోనే 1.3 లక్షల మంది వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
 
"ధోనీ దెబ్బకు క్యాండీక్రష్ డౌన్‌లోడ్స్ విపరీతంగా పెరుగుతాయి.. క్యాండిక్రష్‌లో ధోని ఏ లెవెల్‌లో ఉన్నాడో.." అంటూ కామెంట్లు చేస్తున్నారు.