శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2018 (10:03 IST)

చైనా సైనికులను పరుగుపెట్టించిన ఇండియన్ ఆర్మీ

డ్రాగన్ జవాన్లకు భారత ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లో అంతర్జాతీయ సరిహద్దునుదాటి చైనా బలగాలు కిలోమీటరు దూరం మేరకు చొచ్చుకొచ్చాయి.

డ్రాగన్ జవాన్లకు భారత ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లో అంతర్జాతీయ సరిహద్దునుదాటి చైనా బలగాలు కిలోమీటరు దూరం మేరకు చొచ్చుకొచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన భారత బలగాలు చైనా బలగాలను అడ్డుకున్నాయి. భారత్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో డ్రాగన్ సైనికులు తోకముడిచి పరుగులు తీశారు. 
 
ఈ ఘటన డిసెంబర్ చివరివారంలో అప్పర్ సయాంగ్ జిల్లాలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దును దాటి కిలోమీటరు దూరం వరకు చైనా బలగాలు చొచ్చుకువచ్చాయి. ట్యూటింగ్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. 
 
ఈనేపథ్యంలో తాము అరుణాచల్ ప్రదేశ్‌ను అసలు గుర్తించడమే లేదని, అలాంటప్పుడు తమది చొరబాటు ఎలా అవుతుందని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గెంగ్‌షువాంగ్ వితండవాదనకు దిగారు. అయితే భారత సైన్యం బుధవారం ట్యూటింగ్ ప్రాంతానికి వెళ్లి నిర్మాణ సామగ్రిని సీజ్ చేసింది. దీంతో చైనా బృందాలు వెనక్కి వెళ్లిపోయాయి.