శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (12:04 IST)

2018లో సినిమా కళాకారులకు కష్టాలు-గజల్ శ్రీనివాస్ అరెస్ట్.. అందుకేనా?

2018వ సంవత్సరంలో జరగబోయే విషయాలను జ్యోతిష్యులు ముందుగానే గణించారు. ఈ ఏడాది దేశానికి రాహు, కేతువుల ప్రభావం అధికంగా ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా కించిత్ ఆలస్యం జరుగుతుంది. సినిమా కళాకారులు సమస్యలు అధికం

2018వ సంవత్సరంలో జరగబోయే విషయాలను జ్యోతిష్యులు ముందుగానే గణించారు. ఈ ఏడాది దేశానికి రాహు, కేతువుల ప్రభావం అధికంగా ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా కించిత్ ఆలస్యం జరుగుతుంది. సినిమా కళాకారులు సమస్యలు అధికంగా ఎదుర్కొంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగానే 2018 ప్రారంభమైన రెండో రోజే గాయకుడు గజల్ శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. 
 
అలాగే రాజకీయ నాయకులకు ఒత్తిడి, సమస్యలు, పీడన అధికం అవుతుంది. ప్రముఖుల బలవత్తర మరణాలు జరుగుతాయి. జరగబోయే ఎన్నికల్లో కేంద్ర నాయకులు ఖంగుతింటారు. ఆగస్టు వరకు ఎండ తీవ్రత తగ్గదు. స్త్రీలకు ప్రశాంతత లోపం అధికం. రోడ్డు, రైలు, బస్సు ప్రమాదాలు అధికమవుతాయి. దేశానికి చైనా, పాకిస్థాన్ నుంచి సమస్యలు తప్పవు.
 
రక్షణ భటులకు రక్షణ కరువవుతుంది. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పశ్చిమ, దక్షిణ దేశాల్లో భూకంపనలు, తుఫాను వంటి సమస్యలు అధికంగా ఎదుర్కొంటారు. మతపరమైన విషయాలు, సమస్యలు అధికం అవుతాయి. హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ప్రాంతీయ తత్వం పెరుగుతుంది. విద్యార్థుల బలవత్తర మరణాలు అధికమవుతాయి. 
 
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో అధిక వర్షపాతం. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. తెలుపు, ఎరుపు ధాన్యాల పంటలు బాగా పండుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రజల్లో సుఖశాంతులు తగ్గుతాయి.