సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (22:37 IST)

కరోనా కొత్త వేరియంట్.. వ్యాక్సిన్లకు లొంగదట..

కరోనా కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలకు ముప్పుతిప్పలు పెట్టిస్తోంది. ఇప్పటికే, డెల్టా, ఒమిక్రాన్‌లతో ప్రజలు తలపట్టుకుని కూర్చుంటే.. ఒమిక్రాన్ కంటే శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందే కొత్త వేరియంట్ ముప్పు పొంచి ఉంద‌ని.. అది వ్యాక్సిన్ల‌కు లొంగ‌దని డ‌బ్ల్యూహెచ్‌వో సాంకేతిక విభాగ చీఫ్ మ‌రాయా వాన్ కెర్ఖోవ్ హెచ్చరించారు. కొత్త‌గా పుట్టుకొచ్చే వేరియంట్‌కు రోగ నిరోధ‌క శ‌క్తిని ఏమార్చే గుణం అధికంగా ఉండే ముప్పు ఉంటుంద‌ని వివ‌రించారు.
 
ఈ కార‌ణం వ‌ల్లే ప్ర‌స్తుతం ఉన్న వ్యాక్సిన్ల‌కు అది లొంగ‌కపోవ‌చ్చ‌ని తెలిపారు.క‌రోనాను అరిక‌ట్టేంత‌వ‌ర‌కు నిబంధ‌న‌లు పాటించాల‌ని వాన్ కెర్ఖోవ్ చెప్పారు. ఒమిక్రాన్ కూడా మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని తప్పించుకుని వేగంగా వ్యాప్తి చెందిందని ఆమె గుర్తు చేశారు. క‌రోనా మరొక వేరియంట్‌ రూపంలో విరుచుకుపడొచ్చని వాన్ హెచ్చ‌రించారు.