బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 డిశెంబరు 2021 (10:19 IST)

వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ - భయం గుప్పెట్లో దేశాలు

సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. దీంతో అనేక దేశాలు భయం గుప్పెట్లోకి వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా, పలు రకాలైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎట్-రిస్క్ దేశాల నుంచే వచ్చే ప్రయాణికులపై కఠిన నిఘాను సారించారు. ఇపుడు సరికొత్త ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 
 
నిజానికి ప్రపంచంలో మారణహోమాన్ని సృష్టించిన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోయింది. ప్రాణహానితో పాటు ఆర్థిక రంగాలపై తీవ్రప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ వ్యాప్తికి అనేక రకాలైన కఠిన ఆంక్షలను అమలు చేసింది. 
 
ఇపుడు ఒమిక్రాన్ వైరస్ భయపెడుతుండటంతో మరోమారు ఆంక్షలు విధించేందుకు నిర్ణయించింది. ముఖ్యంగా, ప్రతి ఒక్కరికీ మాస్కులు తప్పనిసరి చేయాలని యోచిస్తుంది. అయితే కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యను దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
మరోవైపు, బ్రిటన్ కూడా ఆంక్షలు విధించింది. కానీ, ఈ ఆంక్షలను అధికారులు యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్ ప్రాంతాల్లో కూడా మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
 
ఇకపోతే సౌత్ కొరియాలో 7 వేకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే ఏకంగా 7 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోతే కఠిన ఆంక్షలు అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నాయి.