గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (12:29 IST)

క్రూడాయిల్ ధరలు తగ్గాయి..

crude oil
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో పరుగులు పెట్టింది క్రూడాయిల్‌ ధర. ఇక, మళ్లీ ఇప్పుడు ముడి చమురు ధరలు దిగి వస్తున్నాయి. మంగళవారం రెండు వారాల కనిష్టానికి చేరుకుంది క్రూడాయిల్‌ ధర. ఓ వైపు రష్య-ఉక్రెయిన్‌ మధ్య చర్చలు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
మరోవైపు… రష్యాలో కరోనా కేసులు పెరగడంతో ఆ ప్రభావం ముడి చమురు ధరలపై పడింది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 4 డాలర్లకు పైగా తగ్గింది. ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 102 డాలర్ల 70 సెంట్లుగా ఉంది. ఈ నెలలో ఒకానొక దశలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 130 డాలర్ల వరకూ వెళ్లింది.