1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-03-2022 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా...

మేషం :- ఆర్థిక వ్యవహారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృషభం :- రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. పెద్దమొత్తంలో స్టాక్ ఉంచుకునే విషయంలో జాగ్రత్త వహించండి. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. మీ వాగ్ధాటితో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన మంచి ఫలితాలు లభిస్తాయి.
 
మిథునం :- రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. రుణం తీర్చి తాకట్టువస్తువులు విడిపించుకుంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ వాగ్దాటితో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఆలయ సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
కర్కాటకం :- శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి అపనిందలు ఎదుర్కొంటారు. వాహన చోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి.
 
సింహం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు ఊపందుకుంటాయి. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను తొరగా ముగించుకుంటారు. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. విరోధులు వేసే పథకాలు తెలివితో త్రిప్పి గొట్ట గలుగుతారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
కన్య :- ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీరు చేసే ఉపకారానికి ప్రత్యుపకారం లభిస్తుంది. ఉన్నత విద్య, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదావకాశాలు లభించగలవు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునప్పుడు జాగ్రత్త వహించండి.
 
తుల :- ఉపాధ్యాయులకు ఆర్థిక పురోగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. కోర్టు తీర్పులు మీకే అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ఊహించని ఖర్చుల వల్ల చేబదుళ్ళు తప్పవు.
 
వృశ్చికం :- మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చుతప్పులుపడుట వల్ల మాటపడక తప్పదు. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన అమలులో పెడతారు.
 
ధనస్సు :- ముఖ్యులతో అత్యంత సన్నిహితంగా మెలగటం వల్ల లబ్ది చేకూరే అవకాశం ఉంది. రచయితలకు పత్రికా రంగంలో వారికి కలసి రాగలదు. ప్రముఖులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లలకు జయం చేకూరుతుంది. ఎండుమిర్చి కంది, పసుపు, ఉల్లి, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. 
 
మకరం :- స్త్రీలు వీలైనంత వరకు మితంగా సంభాషించడం మేలు. వ్యాపారాల్లో స్థిరపడటంతో పాటు అనుభవం గడిస్తారు. కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనం సమయానికి అందడంవల్ల మానసిక కుదుటపడతారు. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కుంభం :- ఆర్థిక యిబ్బందులు లేకపోయినా సంతృప్తి వుండజాలదు. ఆలయాను సందర్శిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తుల్లో వారికి మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఒక కొత్త వ్యక్తితో బంధం ముడిపడి, జీవిత భాగస్వామిగా మారవచ్చు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
మీనం :- ఆటోమోబైల్, ట్రాన్సుపోర్టు రంగాలలో వారికి జయం, శుభం చేకూరుతుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తలెత్తుతాయి. చిన్నచిన్న విషయాలలో సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలుకాగలవు.