శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-03-2022 సోమవారం రాశిఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం...

మేషం :- ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు అభివృద్ధి పొందుతారు. సంఘంలో గుర్తింపు గౌరవం పొందుతారు. వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలు చేస్తారు. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్థులకు యోగప్రదం. మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
 
వృషభం :- వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం. కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రముఖులతో మితంగా సంభాషించటం శ్రేయస్కరం. పెద్ద మొత్తం ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు.
 
మిథునం :- ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. బంధువుల రాకతో అనుకోని కొన్ని ఖర్చులు మీద పడతాయి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి.
 
కర్కాటకం :- ధనం ఎంత వస్తున్నా పొదుపు చేయలేక పోతారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమువుతాయి. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.
 
సింహం :- ఉద్యోగస్తులకు తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ ధ్యేయం నెరవేరుతుంది. సోదరీ, సోదరుల మధ్య విబేధాలు తలెత్తవచ్చు.
 
కన్య :- కొబ్బరి, పండు, పూలు, పానియ, చిరు వ్యాపారులకు లాభం. క్రీడా, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. దైవ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు దైవ కార్యక్రమాలపట్ల అసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు.
 
తుల :- విదేశాలు వెళ్ళటానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఒకకార్యం నిమిత్తం దూరప్రయాణం చేయవలసి వస్తుంది. మీ మంచితనమే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలుసుకుంటారు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
వృశ్చికం :- ఆర్థికంగా ఫర్వాలేదు. అయితే మీకు తెలియకుండానే దుబారా ఖర్చులవుతాయి. రాజకీయ, కళారంగాల వారికి యోగప్రదంగా ఉంటుంది. ముఖ్యుల కోసం షాపంగ్ చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో చికాకులను ఎదుర్కొంటారు. ప్రియమైన వ్యక్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు.
 
ధనస్సు :- బ్యాంకు లావాదేవీలు, దైవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మిమ్మల్ని వ్యతిరేకించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఉపాధ్యాయుల సహనానికి తగిన బహుమతి లభిస్తుంది.
 
మకరం :- కొత్త వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగండి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ పెద్దల ఆరోగ్యలో జాగ్రత్త అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు.
 
కుంభం :- ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రియతములలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. నిర్మాణ పథకాలలో మెళుకువ అవసరం.
 
మీనం :- ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సంఘంలో గుర్తింపు పొందుతారు. భాగస్వామికుల మధ్య పరస్పర అవగాహన కుదురుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తలెత్తినా క్రమంగా సమసిపోతాయి. కీలకమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించండి. వాహనం నడుపునపుడు మెళుకువ, ఏకాగ్రత అవసరం.