శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-03-2022 గురువారం రాశిఫలాలు - సాయిబాబాను ఆరాధించడంవల్ల సర్వదా శుభం..

మేషం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విందులలో పరిమితి పాటించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలలో ఏకాగ్రత వహించి జయం పొందుతారు. పుణ్యక్షేత్రాల దర్శనంవల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
మిథునం :-వస్త్ర, బంగారు వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టటం మంచిది. స్త్రీలకు షాపింగ్ లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిత్రుల కలయిక అనుకూలించక పోవడంతో నిరుత్సాహం చెందుతారు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది.
 
కర్కాటకం :- రచయితలకు, పత్రిక, మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. రావలసిన బకాయిలు వాయిదా పడతాయి. ఆత్యీయుల రాక ఆనందం కలిగిస్తుంది.
 
సింహం :- విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ఆడిటర్లకు పని ఒత్తిడి, ప్లీడర్లకు నిరుత్సాహం తప్పవు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. సోదరీ సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. బ్యాంకు పనులు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాల రీత్యా దూరప్రయాణాలు చేస్తారు.
 
కన్య :- మీ సమర్థతపై భాగస్వామికులకు నమ్మకం కలుగుతుంది. మీ వ్యక్తిగత విషయాలు బయటకు తెలియకుండా గోప్యంగా వుంచండి. సినిమా, సాంస్కృతిక, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఏజంట్లుకు మెళకువ అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
తుల :- ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. విందు, వినోదాలలో పరిమితి పాటించండి. వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలేర్పడతాయి.
 
వృశ్చికం :- అప్పుడప్పుడు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ కళత్రం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
ధనస్సు :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలకు అయిన వారిని చూడాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. ఎదురవడంతో మీ కష్టాన్ని, ఆందోళనని గుర్తిస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
మకరం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. రాబోయే ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి.
 
కుంభం :- ఉద్యోగ యత్నాలు ఓ కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. రాజకీయ, పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక సమస్యలు తప్పవు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చివరి క్షణంలో చేతిలో ధనం ఆందక సమస్యలు ఎదుర్కొంటారు. ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించుటవలన మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మీనం :- ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ధనం విపరీతంగా వ్యయం చేసే మీ ధోరణిని మార్చుకోవటం శ్రేయస్కరం. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటలు ఎదుర్కుంటారు.