శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 22 మే 2019 (15:50 IST)

దలైలామాకు ఏమైంది? భక్తుల ఆందోళన.. భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామకు ఏదో జరిగినట్టుగా ఆయన భక్తులు భావిస్తున్నారు. 83 యేళ్ళ వయసు కలిగిన దలైలామా... గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికితోడు వృద్ధాప్య సమస్యలు ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. పైగా, ఆరోగ్యం సహకరించకపోవడంతో గత కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా, ఛాతి ఇన్‌ఫెక్షన్‌ సోకి తీవ్ర అస్వస్థతకు గురికాడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. 48 గంటల అబ్జర్వేషన్‌ తర్వాత వైద్యులు దలైలామాను ఇంటికి పంపారు. ఆ తర్వాత ఆయన భక్తులకు కనిపించడం లేదు. దీంతో ధర్మశాలలోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు, ధర్మశాలలో దలైలామా నివాసం వద్ద అధికార సిబ్బంది మంగళవారం మాక్‌డ్రిల్‌ నిర్వహించడంతో ఆయన అరోగ్యంపై పలు రకాల వదంతులు వ్యాపించాయి. సాధారణంగా ఆధ్యాత్మిక గురువుల ఆరోగ్యం క్షీణించిన సమయంలో ముందస్తు చర్యగా ఇలా మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తారు. అంబులెన్స్‌తోపాటు పదుల సంఖ్యలో వాహనాలు ధర్మశాలకు వెళ్తుండడంతో దలైలామా అనుచరులు ఆందోళన చెందుతున్నారు. దలైలామా అరోగ్య పరిస్థితి గురించి ఆతృతతో ఎదురు చూస్తున్నారు.