గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (10:03 IST)

ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం.. రెండు వారాల్లో 4600 మంది మృతి

Israel war
ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. గత రెండు వారాలుగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 4,600 మంది మరణించారని గాజాలోని అధికార వర్గాలు తెలిపాయి. హమాస్ దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా గాజాలోని ఓ నివాస భవనంపై జరిగిన దాడిలో 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. జబలియా శరణార్థ శిబిరం ఉన్న అల్ సుహాదా ప్రాంతంలో ఈ భవనం ఉన్నట్టు తెలిపింది.
 
గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో 266 మంది మరణించారని, వీరిలో 117 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.