సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:38 IST)

చైనాలో వరదలు విజృంభణ.. 302 మంది మృతి

చైనాలో వరదలు విజృంభిస్తున్నాయి. చైనాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు విలయం సృష్టించాయి. వర్షాల ధాటికి సెంట్రల్‌ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లో సుమారు 302 మంది కోల్పోయారని.. 50 మందికిపైగా గల్లంతయ్యారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. 
 
గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి కుంభవృష్టి కురవడంతో వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా దాదాపు 11.3 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
 
వరదల ధాటికి హెనాన్‌ ప్రావిన్స్‌ రాజధాని జెంగ్‌ జౌ నగరంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, ముగ్గురు గల్లంతయ్యారని పేర్కొన్నారు. పింగ్‌డింగ్‌షాన్ నగరంలో ఇద్దరు‌, లూహే నగరంలో ఒకరు చొప్పున మృతి చెందారు.