శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (12:12 IST)

అసాధారణ పరిణామం : ఒక్కటికానున్న కిమ్ జాంగ్ ఉన్ - డోనాల్డ్ ట్రంప్

ప్రపంచంలో ఓ అసాధారణ పరిణామం ఆవిష్కృతం కానుంది. రెండు భిన్న ధృవాలు ఏకం కానున్నాయి. అంటే ఇద్దరు బద్ధశత్రువులు ఒక్కటి కానున్నారు. ఆ బద్ధ శత్రువులు ఎవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొ

ప్రపంచంలో ఓ అసాధారణ పరిణామం ఆవిష్కృతం కానుంది. రెండు భిన్న ధృవాలు ఏకం కానున్నాయి. అంటే ఇద్దరు బద్ధశత్రువులు ఒక్కటి కానున్నారు. ఆ బద్ధ శత్రువులు ఎవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్. వీరిద్దరూ త్వరలోనే చేతులు కలుపనున్నారు. 
 
వరుస క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసిన ఉత్తర కొరియాపై అమెరికా అనేక రకాల ఆంక్షలు విధించింది. అలాగే ఉత్తర కొరియా వైఖరితో ఇరు దేశాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఫలితంగా ఎన్నో నెలల పాటు రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు నెలకొన్నాయి. వీటిని తొలిగించేందుకు పలు దేశాలు మధ్యవర్తిత్వం కూడా వహించాయి. 
 
ఈ నేపథ్యంలో అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. ఈ ప్రకటనను వైట్‌హౌస్ స్వాగతించింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని తొలగేందుకు ఇది ఎంతో సహకరిస్తుందని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. 
 
ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సౌత్ కొరియా జాతీయ భద్రతా సలహాదారు చుంగ్ ఈ యాంగ్, శ్వేతసౌధంలో అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈయన ఉత్తర కొరియా - అమెరికా అధినేత భేటీకి కీలకంగా వ్యవహరించారు. 
 
వింటర్ ఒలింపిక్స్ తర్వాత ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణం చల్లబడగా, గడచిన సోమవారం నాడు పాంగ్ యాంగ్‌లో కిమ్‌తో చుంగ్ ఈ యాంగ్ 4 గంటల పాటు సమావేశమయ్యారు. ఆ వివరాలను అగ్రరాజ్యానికి వివరించిన ఆయన, మే నెలలోగా ట్రంప్, కిమ్ భేటీ ఉంటుందని, అందుకు ట్రంప్ సైతం అంగీకరించారని స్పష్టంచేశారు.