మంగళవారం, 4 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మార్చి 2025 (10:34 IST)

శ్వేతసౌథంలో ట్రంప్‍తో మాటల యుద్ధం.. ఉక్రెయిన్‌కు ఆగిన సాయం!

Zelenskiy - trump
ఉక్రెయిన్‌పై అగ్రరాజ్యం అమెరికా కన్నెర్రజేసింది. ఆ దేశానికి అందిస్తూ వచ్చిన సైనిక, ఆర్థిక సాయాన్ని నిలిపివేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. దీంతో ఇప్పటికే ఆయుధాలతో బయలుదేరిన నౌకలు, విమానాలు అర్థాంతరంగా ఆగిపోయాయి. 
 
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య కొంత కొంతకాలంగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని ఆపి ఇరు దేశాల మధ్య శాంతిస్థాపనకు అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ఉక్రెయిన్ అధినేత వ్లోదిమిర్ జెలెన్‌స్కీతో శ్వేతసౌథంలో చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా వారిరివురు మధ్య మాటలయుద్ధం సాగింది. ట్రంప్‌తో జెలెన్‌స్కీ వాగ్వాదానికి దిగడాన్ని అగ్రరాజ్యం ఏమాత్రం సహించలేకపోయింది. ఫలితంగా ఉక్రెయిన్‌‍కు అందిస్తున్న మిలిటరీ సాయాన్న నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. 
 
అధ్యక్షుడు ట్రంప్ శాంతి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని, తమ భాగస్వాములందరూ ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. తాము అందిస్తున్న సాయం సమస్య పరిష్కారానికి పనికొస్తుందా? లేదా? అన్నదానిపై సమీక్షిస్తామని అందుకే సాయాన్ని నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
శుక్రవారం వైట్‌హౌస్ రష్యా - ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం వాడీవేడిగా సాగింది. రష్యాతో యుద్ధంలో సాయం చేస్తున్నా ఉక్రెయిన్‌కు తమకు కృతజ్ఞతగా ఉండటం లేదని ట్రంప్ నిందించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు తీసుకెళుతూ పోలాండ్‌లోని ట్రాన్సిట్ ఏరియాలో ఉన్న నౌకలను అక్కడే నిలిపివేయనున్నట్టు వైట్‌హౌస్ అధికారి తెలిపారు.