బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (14:31 IST)

గ్వాంటనామా బే జైలుకు తరలించండి : డోనాల్డ్ ట్రంప్

న్యూయార్క్ మ్యాన్‌హాట్టన్ ప్రాంతంలో ట్రక్కుతో పాదచారులు, స్కూలు పిల్లలను తొక్కించి పట్టుబడిన ఉగ్రవాదికి సభ్య సమాజంలో జీవించే హక్కు లేదనీ, అందువల్ల ఆ ఉగ్రవాదినికి గ్యాంటనామా బే జైలుకు తరలిస్తామని అమెరి

న్యూయార్క్ మ్యాన్‌హాట్టన్ ప్రాంతంలో ట్రక్కుతో పాదచారులు, స్కూలు పిల్లలను తొక్కించి పట్టుబడిన ఉగ్రవాదికి సభ్య సమాజంలో జీవించే హక్కు లేదనీ, అందువల్ల ఆ ఉగ్రవాదినికి గ్యాంటనామా బే జైలుకు తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. 
 
ఈ ఉగ్రదాడి తర్వాత ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాడు సభ్య సమాజంలో నివసించేందుకు తగిన వ్యక్తికాదని, ప్రాణాలతో పట్టుబడిన ఉగ్రవాదిని క్వూబాలో ఉన్న గ్వాంటనామా బే జైలుకు తరలిస్తామని చెప్పారు. వాడిక జీవితాంతం అక్కడే ఉంటాడని హెచ్చరించారు.
 
అదేసమయంలో తన వలస విధానమే మంచిదని, ఏ దేశం నుంచి పడితే ఆ దేశం నుంచి వచ్చిన వారికి అనుమతులు, వీసాలు ఇస్తూ పోతుంటే, ఇటువంటి అనర్థాలే జరుగుతాయని ఆయన హెచ్చరించారు. ఇకపై వీసా విధానాన్ని మరింత కఠినం చేసి తీరుతామని అన్నారు. అమెరికాను సురక్షితంగా చేయడమే తన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.