గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (11:14 IST)

డోనాల్డ్ ట్రంప్‌కు కరోనా వైరస్ పరీక్షలు.. ఫలింతం ఏంటంటే...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయన కరోనా వైరస్ సోకలేదని తేలింది. ఈ విషయాన్ని అమెరికా శ్వేతసౌథం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ 149 దేశాల్లో విశ్వరూపం చూపించింది. ఆ వైరస్ పుట్టిన చైనాలో మాత్రం వ్యాప్తి గణనీయంగా తగ్గిపోతే, ఇతర దేశాల్లో మాత్రం ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో అమెరికా దేశ వ్యాప్తంగా ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. భారత్ కూడా కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించింది. 
 
ఈ పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కరోనా వైరస్ నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన నుంచి రక్తాన్ని సేకరించిన వైద్యులు పరిశోధనాశాలకు పంపించారు. ఈ పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ అని తేలింది.
 
ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో, ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోలను డోనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఆపై ఫాబియోకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో డోనాల్డ్ ట్రంప్‌కు కూడా ఈ వైరస్ పరీక్షలు చేశారు. కాగా, కాగా, అమెరికాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 5 వేల కోట్ల డాలర్లు విడుదల చేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.