మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:24 IST)

రెడీ.. వన్.. టు.. త్రీ... కిమ్‌పై సైనిక చర్యకు సిద్ధం : డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గర్జించారు. ప్రపంచ దేశాలను ధిక్కరిస్తున్న ఉత్తర కొరియాపై సైనిక చర్య చేపట్టేందుకు సర్వం సిద్ధంగా ఉన్నాయంటూ ఆయన ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గర్జించారు. ప్రపంచ దేశాలను ధిక్కరిస్తున్న ఉత్తర కొరియాపై సైనిక చర్య చేపట్టేందుకు సర్వం సిద్ధంగా ఉన్నాయంటూ ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనలో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి.
 
స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్ తో కలసి పాల్గొన్న సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ... తరచూ క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలను ఆందోళనలకు గురి చేస్తున్న ఉత్తర కొరియాపై సైనిక చర్య చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామన్నారు.
 
అదే జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. యూఎస్ బాంబర్లను తాము కూల్చివేయగలమని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నార్త్ కొరియా విదేశాంగ మంత్రి ప్రకటించిన మరుసటి రోజు ట్రంప్ స్పందించారు.
 
'సైనిక చర్య' అన్న పదం తమ తొలి ఆప్షన్ కాదని, రెండో ఆప్షన్‌గానే దాన్ని ఎంచుకున్నామని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాము రంగంలోకి దిగితే మాత్రం పూర్తి విజయం సాధించే వరకూ వదిలేది లేదని తేల్చిచెప్పారు.